జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా

బలహీనతను బలమునకు మార్చుకొనుము
ఉద్యోము, స్నేహము, గృహములందు శ్రేష్టతను చూపగోరుదుము. ఎల్లప్పుడు ప్రార్ధించుచు ప్రభువు యొక్క సేవ చేయుచు, మాటలతోను క్రియలతోను ఆయనను ఘనపరచగోరుదుము. జీవితము సంపూర్తిగానుంచికోన గోరుదుము. చురుకుగా నుంచగోరుదుము.
కానీ సమయము, బలములేక భయపడుచున్నందున అట్లు చేయలేక పోవుచున్నాము.
ఒకవేళ నేడు నీవు నిరుత్సాహము మరియు భయముతో నున్నావేమో.అట్లుండిన యెడల నిన్ను పప్రోత్సహించెదను. బైబిలు చెప్పున దేమనగా "భయపడకుడి, వాటిని చూచి దిగులు పడకుడి. నిన్నెడ బాయను" (ద్వితీయోపదీశకాండము 31:6)
బలహీనమగు స్థితిలో నున్నట్లు నీవు నీవుకనుగొనినయెడల అప్పుడే నీవు దేవుని శక్తిని అనుభవించుగలవు. ఆయన బలమును పొందుటకు అదియే సమయమైయున్నది. ఏమియు చెయ్యలేమని వైద్యులు చెప్పినప్పుడును ఆర్థికముగా సమస్య యేర్పడినపుడు మరియు సమస్తము పని చేయలేనప్పుడు భయము బలముగా ఆవరించినప్పుడు దేవుడు నీకు మాట్లాడుచు నీకు బదులుగా పని చేయుచున్నాడు.
దేవునియందు విశ్వాసముంచు కొనుము. నీ బలహీనత, చింత, అలసట, సందేహము, భయము దేవునికిచ్చి , ఆయన బలమును సంతోషమును శక్తిని నమ్మి పొందుము. ఇటువంటి సమయము నందు అయన నీతోనున్నాడు.ఆయనను నమ్మి ఆయన నుండి సమస్తమును పొందుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!
More
ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/