జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా
![జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F14392%2F1280x720.jpg&w=3840&q=75)
దేవుని గూర్చి భయము ఉన్నదా?
ఏదేనుతోటలోయున్నా మని ఊహించుదము. అదివరకే పతనము జరిగిపోయినది. స్త్రీపురుషులిరువురు దేవునికి అవిధేయులైరి. అయన యెదుట పావము చేసిరి. నిషేధింప బడిన పండును భుజించిరి. దేవునితో నుండిన ఐక్యత తెగి పోయెను. వీరి పాపము మొదటిగా . దేవుని నుంది వేరుపరచెను. విభజించెను. దీని గూర్చిన ఆలోచనయున్నదా?... భయము! మొదటి సారిగా బైబిలునందు భయము ప్రస్తావించ బడిన చోటు యిదియే. పతనము . జరిగిన పిదపజరిగెను."అందు కతడు -నేను తోటలో నీస్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను" (ఆదికాండము 3:10)
ఆదాము భయపడియుండుటకు కారణ మోమి? అతని దిగంబరత్వము మరియు అవిధేయత భయమును రేపెను. ఇట్టిది అతనిని దేవుని నుండి దాగుకొనునట్లు చేసెను. సృజించి, ప్రేమించి అతన్ని గూర్చి శ్రద్ధ వహించిన దేవునినుండి దాగుకొనెను. అయనే అతనితో అనుదినము సహవాసించుచు మాట్లాడియుండెను.
దేవుని గూర్చి భయపడినప్పుడు ఆయన సన్నిధి నుండి పారిపోదుము. కానీ అయన సన్నిధియందు మనకు పాప క్షమాపణ, కృప, మరియు శక్తి అనునవి కలుగబోవువాటిని ఎదుర్కొనుటకు తోడ్పడుచున్నవి.
తండ్రి యెదుట నిలబడకుండునట్లు చేసిన నేరము ఆటంకపరుచుచున్నదేమో.అయినను దేవుడు తన చేతులు చాచి, తప్పిపోయిన కుమారుని తండ్రి వలెనే (లూకా 15:11-24)
నీ హృదయ ద్వారము నొద్ద నీ కొరకు వేచియున్నాడు. ఆయన కొరకు ద్వారమును తెరువుము. ఆయనను లోపలికి రానిమ్ము. నీ ప్రాణాత్మలను జీవితమును భద్రపరచనిమ్మ. దేవుడు నిన్ను ప్రేమించు చున్నాడు. పాపక్షమాపణను కోరిన యెదడల. ఆయననే అడుగగవలెను. ఆయన నిన్ను క్షమించును నీ జీవితము, నీ హృదయము ఎట్లున్నదో నేనెరుగను కానీ నేడు దేవుని నుండి వచ్చు మధురమగు పిలువును అనుభవించిన యెడల దానికి జవాబు యివ్వవలసినదే, పరిశుద్ధాత్మని ఆహ్వానించుచు నీ యొక్క హృదయము ఆత్మను పరిశీలించనిమ్ము. ఆ విధముగా చేయుట కిష్ట పడుచున్నావా? అట్లు చేయుట కిష్ట పడిన యెడల నాతో కలిసి ప్రార్థించుము....
ప్రభువా కొన్నిసార్లు నీ సన్నిధిలోనికి వచ్చి నీతో సంభాషించుటకు భాయవడుచునాన్ను. ఎందుకనగా నేరస్థుడను, అల్పుడను.నీ వరిశుద్ధాత్మను కనుబరచి నీ యొద్దకు వచ్చుటకు ఆటంకపరచునదేమోచూపుము. వాటి నన్నిటిని చూపి, వాటిచి విడిచిపెట్టుటకు సహాయపడుము. యేసు నామమున, ఆమెన్.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
![జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F14392%2F1280x720.jpg&w=3840&q=75)
భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!
More
ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/