భయాన్ని జయించుట నమూనా
భయాన్ని జయించుట
భయం అనేది నొప్పి, ప్రమాదం, హాని మూలంగా సంభవించే ఒక ఇబ్బందికరమైన ఉద్రేకముగా నిర్వచించబడింది. భారత దేశంలో క్రికెట్ క్రీడాకారులు ఒక మాదిరి దేవుళ్ళుగా పరిగణించబడి తమ క్రీడను గొప్పగా ప్రదర్శించి ఆటపై సుస్థిరమైన పట్టును సాధించాలనే ఒత్తిడిని నిరంతరము కలిగియుంటారు. ఒక క్రికెట్ క్రీడాకారుడై ఉండుటలోని ఒత్తిడితో పాటుగా, నిరంతరం పోరాడే మరిన్ని భయాలు నాలో వాస్తవంగా ఉన్నాయి. ఓటమి భయము, సరిగ్గా ఆడలేననే భయము, లక్ష్యాన్ని ఛేదించలేననే భయము, నాకోసం నేను నిర్దేశించుకొన్న విధంగా లేక ఇతరులు నాపై ఉంచిన నమ్మకానికి తగినట్టుగా జీవించలేకపోవచ్చనే భయము మొదలైన భయాలన్నీ నేను ఎదుర్కొంటాను.
అనుదిన జీవితపరిధిలో ఇవన్నీ నేను అనుభవిస్తూనే ఉంటాను. దేవుడు నాకోసం దాచి ఉంచిన అతిశ్రేష్టమైన జీవితం జీవించటానికి నా భయాలన్నీ జయించవలసిన అవసరత ఉందని నేను కనుగొన్నాను. నీవిది చదువుతూ ఉండగా నీవు కూడా నీ భయాలను ఎదుర్కొని జయించి విజయవంతమైన జీవితం జీవించగలవని నమ్ముతున్నాను.
'భయపడకుడి' అని ప్రభువు పదే పదే తన ప్రజలను ప్రోత్సహిస్తున్నప్పటికీ మనము భయంతో నిండిన జీవితాలు జీవిస్తున్నాము.
ద్వితీయోపదేశకాండం 31:8 ఇలా చెబుతుంది, "ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయ పడకుము విస్మయమొందకు".
దేవుడు మనతో ఉన్నాడని మనం ఎరిగియున్న విధంగా, ఆయన వాగ్దానం మేరకు మన పరిస్థితులేవైనప్పటికీ మనం శాంతి సంతోషాలను కనుగొనవలసియున్నాం.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారుడైన జేపి డుమిని, భయాన్ని ఎదుర్కొని జయించడాన్ని గూర్చి తన స్వానుభవమును పంచుకుంటున్నాడు. మన భయాలను ఆయనకు అప్పగించే క్రమంలో మన నిజమైన విలువను, యోగ్యతను గుర్తించుటకు సర్వశక్తుడైన దేవుని వైపు చూడటము యొక్క ప్రాముఖ్యతను డుమిని నొక్కి చెప్తున్నాడు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు JP Duminy కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://jp21foundation.org/ |