భయాన్ని జయించుట నమూనా
భయాన్ని జయించుట –కృతజ్ఞతా హృదయాన్ని కలిగివుండుట
పౌలు కొలొస్సి సంఘాన్ని హెచ్చరిస్తూ “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు" అని చెప్పాడు.
ఈ వచనము నిజముగా నాతో మాట్లాడినది ఎందుకనగా మనలో అనేకమంది ఎవరికో ఒకరికి ఉద్యోగము చేస్తాము, అది ఒక వ్యక్తికో, సంస్థకో లేక వ్యవస్థకైనా అయివుండొచ్చు. మనం ఏ పని చేసినా ఆయన నిమిత్తము చేసినట్లు చెయ్యాలని దేవుడు తెలియజేస్తూ వున్నాడు. ఆ పని నాకు ఎట్టిదైనా, ఎటువంటి ఫలితాన్నిచ్చినా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు . నీవెట్టి పరిస్థితిలో నున్నా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని నీవు తెలుసుకోగలవు.
"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము." అని రోమా 8 : 28 చెప్తున్నది.
నిన్ను నీవు ఏ పరిస్థితుల్లో కనుగొన్నప్పటికీ నీవు దేవుణ్ణి ప్రేమించినపుడు ఆయన సమస్తం నీ మేలు కొరకై సమకూర్చి జరిగిస్తాడు.
తీరిక దొరకని కార్యక్రమాలు సుదీర్ఘ ప్రయాణాలతో సాగె నాకు, సహవాసము ఎక్కువగా స్కైప్ పై కొనసాగుతుంది. తన ప్రశ్నతో నన్ను సవాలు చేసిన ఒక స్నేహితుడితో ఇటీవల నేను స్కైపింగ్ చేశాను. ఆ ప్రశ్న నా జీవితాన్ని మార్చివేసింది. జీవితములో నాకు అనుగ్రహించబడిన దీవెనలను ఈ ఘడియలో నేను ఆనందించగలుగుతున్నానా అని అతను నన్ను ప్రశ్నించాడు. మొదట, అతను అడిగిన ప్రశ్నలోని పర్యవసానాల్ని నేను అర్థం చేసుకోలేదు. ఆ సమయంలో నేను నా జీవితంలో ఎక్కడ ఉన్నాను, నేను ఏమి చేస్తున్నాను, నేను చేసేది నేను ఇష్టపడుతున్నానా అనే విషయాలు అతను ప్రాథమికంగా అడిగాడు.
నేను కొంత ఆలోచన చేశాను. నేనొక క్రికెటర్ని నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. నా ఉద్యోగం నన్ను ఎక్కడికి తీసుకు వెళ్తుందో అక్కడ నేను ఆనందించగలుగుతున్నానా? వీటన్నిటికీ యధార్ధంగా జవాబు చెప్పాలంటే “లేదు” అనే జవాబే వస్తుంది ఎందుకంటే కొన్ని సార్లు భయాలు, ఆందోళనలు, సందేహాలు మరియు నన్ను గూర్చిన ప్రజల విమర్శలు నాపై ఏలుబడి చేసేందుకు నేనే సమ్మతిస్తాను.
నిజంగా నాకు అనుగ్రహించబడిన దీవెనలను ఆస్వాదిస్తున్నానా అని అతను వేసిన ప్రశ్నను పునరాలోచన చేసినపుడు వాస్తవంగా నాలోని భయాలపై దృష్టి పెట్టటం తగ్గించాను. నా హృదయములో ఏముందో నాకు తెలుసు గనుక ప్రదర్శన నిమిత్తము నా ఆరాటం తక్కువయ్యింది. మైదానములోనికి నడిచి వెళుతున్నప్పుడు దేవుడిని మహిమ పరచాలనే ఉద్దేశ్యంతో నా హృదయం నిండి ఉంటుంది గనుక నేను ఎంత స్కోరు సాధించగలను? ఎంతవరకు సాధించలేను? అనేవి నాకు ప్రాముఖ్యమై ఉండవు. నా జట్టు ఘనత, లేక నా ఘనత కంటే, దేవుని నామ ఘనత నాకు ప్రాముఖ్యమై ఉండాలని నేను గ్రహించాను.
ఈ ప్రణాళిక గురించి
సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారుడైన జేపి డుమిని, భయాన్ని ఎదుర్కొని జయించడాన్ని గూర్చి తన స్వానుభవమును పంచుకుంటున్నాడు. మన భయాలను ఆయనకు అప్పగించే క్రమంలో మన నిజమైన విలువను, యోగ్యతను గుర్తించుటకు సర్వశక్తుడైన దేవుని వైపు చూడటము యొక్క ప్రాముఖ్యతను డుమిని నొక్కి చెప్తున్నాడు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు JP Duminy కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://jp21foundation.org/ |