భయాన్ని జయించుట నమూనా
భయాన్ని జయించుట –నీవెవరివాడవై యున్నావో ఎరిగియుండు
ప్రభువు ఈలాగు చెబుతున్నాడు, "భయపడకు నేను నిన్ను విమోచించియున్నాను, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు".
నేనెందుకు భయపడుతున్నాను? కారణం, నాకు తెలియని విషయాలన్నిటి వలనే, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో నాకు తెలియదు. ఇతరులు నన్ను గూర్చి ఏమి అనుకుంటున్నారో లేక నానుండి ఏమి ఆశిస్తున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు.
మనుష్యులుగా మన విషయమై ప్రజలు ఏమి చెబుతారు లేదా ఏమి ఆలోచిస్తారు అనేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు.
మీ చేతిలో ఒక 100 డాలర్ల నోటు ఉందనుకోండి, మీరు దాన్ని తొక్కి నలిపివేసినా దాని విలువ తరగదు, అవునా? సదరు ద్రవ్య విలువ అలాగే ఉంటుంది. మన జీవితాల విలువ కూడా అటువంటిదే.
జీవన పయనము కొనసాగిస్తున్నపుడు, ప్రజలు మనలను అణగద్రొక్కవచ్చు లేదా మన గురించి నానావిధములుగా మాట్లాడవచ్చు, పర్యవసానంగా మనకు విలువ లేదని మనము కుమిలిపోతాము. కానీ దేవుడు నిన్ను తన బిడ్డగా చూస్తాడు! అయన దృష్టిలో మీరు సమర్థులు మరియు ఎంతో శ్రేష్ఠులు!
నాలోని సందేహాలు, భయాలు, ఆందోళన పూరితమైన తలంపులతో నేను పోరాడుతున్నపుడు, నాకు ఏకైక ఆదరణ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకోవటవలన, నేనొక శ్రేష్ఠమైన వ్యక్తినని మరియు నాలో కార్య సాధకమైన ఆయన శక్తితో నేను సమస్తమును చేయగలనని గ్రహించుటవలన నాకు లభించింది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారుడైన జేపి డుమిని, భయాన్ని ఎదుర్కొని జయించడాన్ని గూర్చి తన స్వానుభవమును పంచుకుంటున్నాడు. మన భయాలను ఆయనకు అప్పగించే క్రమంలో మన నిజమైన విలువను, యోగ్యతను గుర్తించుటకు సర్వశక్తుడైన దేవుని వైపు చూడటము యొక్క ప్రాముఖ్యతను డుమిని నొక్కి చెప్తున్నాడు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు JP Duminy కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://jp21foundation.org/ |