భయాన్ని జయించుట నమూనా
![భయాన్ని జయించుట](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F15670%2F1280x720.jpg&w=3840&q=75)
భయాన్ని జయించుట- మనం ఎవరిమో ఎరిగి యుండుట
ఎక్కడ – మరెంతో ప్రాముఖ్యంగా - నా గుర్తింపు ఎవరిలో ఉంది?
కొన్నిసార్లు, అనేక క్రికెటర్ల మాదిరిగానే, మైదానంలో నా ప్రదర్శన ఇతరులు నా గురించి చెప్పే వాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ నేను క్రీస్తులో పాతుకుపోయి ఉండాలని నేర్చుకున్నాను కాబట్టి నా గుర్తింపు పూర్తిగా మరియు ముమ్మాటికి యేసులోనే ఉంది.
క్రికెటర్ల ప్రపంచంలో, ఎవరి అభిప్రాయాలు ఉద్దేశ్యాలు ప్రాముఖ్యతను కలిగివుంటాయో అట్టి నిర్వాహకులను, శిక్షకులను మేము కలిగివుంటాము. అయితే వారి అభిప్రాయాలకు ప్రభావితమై కంగారు పడకుండా ఏంతో అప్రమత్తముగా ఉండాలి. వారి అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వటం వలన ఇటువంటి శిక్షకులు, తోటి ఆటగాళ్ళు చివరకు అభిమానులు కూడా మన విలువలను కొలతవేయటానికి మనమే అనుమతిస్తాము. ఇలా అనుమతించటం వలన వీరందరి అభిప్రాయాల మీదనే మన స్వీయ విలువను ఏర్పరుచుకుంటాము. ఇటువంటి వాటిని అనుమతించకుండా ఉండటమనేది అత్యంత కీలకమైన విషయము.
మీ వృత్తి ఏదైనా సరే , కార్పోరేట్ రంగమువారైనా , ప్రభుత్వ ఉద్యోగులైనా, విధ్యార్థులైనా, మీరు మరియు నేను మన గుర్తింపు దేనిని ఆధారము చేసుకొనివుందో మరియు ఎవరి అభిప్రాయం ప్రాముఖ్యమైనది అనే విషయముపై స్పష్టంగా ఉండాలి.
నాకైతే నా గుర్తింపు క్రీస్తులోనే కలదు ఆయన నన్ను గూర్చి చెపుతున్నది రూఢిగా విశ్వసిస్తాను.
ఈ ప్రణాళిక గురించి
![భయాన్ని జయించుట](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F15670%2F1280x720.jpg&w=3840&q=75)
సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారుడైన జేపి డుమిని, భయాన్ని ఎదుర్కొని జయించడాన్ని గూర్చి తన స్వానుభవమును పంచుకుంటున్నాడు. మన భయాలను ఆయనకు అప్పగించే క్రమంలో మన నిజమైన విలువను, యోగ్యతను గుర్తించుటకు సర్వశక్తుడైన దేవుని వైపు చూడటము యొక్క ప్రాముఖ్యతను డుమిని నొక్కి చెప్తున్నాడు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు JP Duminy కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://jp21foundation.org/ |