భయాన్ని జయించుట నమూనా

భయాన్ని జయించుట – మన హృదయంలోని విగ్రహాలతో వ్యవహరించుట
ఒక క్రీడాకారుడిగా నా ప్రదర్శన మరియు విజయాల ఆధారముగా నిరంతరం నాపై అంచనా ఉంటుంది. ఈ దశలో నా ప్రదర్శన నాకొక విగ్రహం కాకుండా నేను జాగ్రత్త పడవలసి ఉంటుంది. దీన్ని నేను విగ్రహమనే అంటాను ఎందుకంటే మన విలువ మన ప్రదర్శన ద్వారా నిర్దేశించబడినపుడు, మన అహం గాయపడుతుంది. ఇది ఒక క్రైస్తవునిగా నేను నేర్చుకోవలసిన విలువైన పాఠము. ఇది అనుకున్నంత సులభం కాదు ఎందుకనగా నాకొరకు నేను లక్ష్యాలను కలిగి ఉన్నాను, నాకు గెలుపు అవసరము.
కానీ గెలుపే సర్వస్వం కాదని నేను గ్రహించాను. గెలవడం గొప్ప విషయం. మనం మన శాయశక్తులా గెలుపు కొరకు కృషి చేస్తాం, కానీ మన దృష్టి యావత్తూ విజయం వైపే సారిస్తే అప్పుడదీ విగ్రహమే అవుతుంది. ఇప్పుడు మనం ఇట్టి బలవత్తరమైన విగ్రహాలను గుర్తించగలిగాము, కానీ ఏ విధంగా వీటిని సమతుల్యం చేసుకోగలం? మనం సాధ్యమైనంత కృషి చేసి, శక్తి మేరకు కష్టపడి ఆపై సమస్తం దేవుని అధికారానికి అప్పగించాలి.
మనలను ఎన్నడూ విడువనని ఎడబాయనని దేవుడు మనకు వాగ్దానం చేసాడు, మన చేతుల పనిని దీవిస్తానని కూడా దేవుడు వాగ్దానం చేసాడు. మనం చేసే సమస్తములో ఆయన మనలను నడిపించునట్లు మనం ఆయనకు సమర్పించుకుందాం.
ఈ ప్రణాళిక గురించి

సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారుడైన జేపి డుమిని, భయాన్ని ఎదుర్కొని జయించడాన్ని గూర్చి తన స్వానుభవమును పంచుకుంటున్నాడు. మన భయాలను ఆయనకు అప్పగించే క్రమంలో మన నిజమైన విలువను, యోగ్యతను గుర్తించుటకు సర్వశక్తుడైన దేవుని వైపు చూడటము యొక్క ప్రాముఖ్యతను డుమిని నొక్కి చెప్తున్నాడు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు JP Duminy కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://jp21foundation.org/ |