ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

7 యొక్క 1

“బంగారు నియమం”

ఒక రాజకీయవేత్తయైనా, ఒక వ్యాపార నాయకుడైనా, స్ఫూర్తి నింపే వక్తయైనా, లేదా ఒక సాధారణ వ్యక్తియైనా, ఏ వృత్తిలో ఉన్నవారైనా కొన్ని సందర్భాలలో బంగారు నియమం యొక్క గొప్పతనం గురించి మాట్లాడతారు. వాస్తవానికి, దాదాపు అందరికీ దీన గురించి తెలిసే ఉంటుంది మరియు దాని అర్థం కూడా తెలిసే ఉంటుంది.

“మీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో మీరు ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించాలి” అనే మాట సమాజంలో చాలా అవసరమైంది అని ఎక్కువమంది అంగీకరిస్తారు. అనేక విధాలుగా, మన సంస్కృతిని, కుటుంబాలను మరియు స్నేహితులను కలిపి ఉంచేది ఇదే సూత్రం. ఇతరులకు సేవ చేయుట, దాతృత్వం కలిగి ఉండుట మరియు అవసరతలో ఉన్నవారికి సహాయం చేయుట యొక్క గొప్పతనాన్ని ఈ బంగారు నియమం చూపిస్తుంది.

విజయవంతమైన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రధానమైన ఈ బంగారు నియమాన్ని మొదటిగా బోధించింది యేసు ప్రభువే.

“కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.” మత్తయి 7:12

క్రైస్తవులముగా, మన విశ్వాసాన్ని కేవలం దేవునియందు నమ్మిక ఉంచడం అనేదానికి మించి ముందుకు తీసుకెళ్లాలి అని దేవుడు పిలుస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరూ ఇతరుల జీవితాలను తాకుట ద్వారా మన విశ్వాసాన్ని క్రియారూపంలోనికి మార్చి తద్వారా దేవుని ప్రేమ మరియు కరుణను చూపించి దేవుని మహిమ పరచాలని ఆయన కోరిక. నిజంగా బంగారు నియమం ప్రకారం జీవించడం అంటే ఇదే.

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te