ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

7 యొక్క 6

“ఇతరులకు పరిచర్య చేయండి”

పరిచర్య చేయటం అనేదానికి నిర్వచనం ఇతరుల అవసరత సమయంలో వారికి స్పందించుటకు అందుబాటులో ఉండుట. అలా స్పందించటానికి మన సమయం, తలాంతు, వనరులు మరియు శ్రమలను ఖర్చుచేయవలసి ఉంటుంది; కానీ దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమను బట్టి పరిచారము చేయుట అనేది అంత్యంత సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన అనుభవముగా ఉంటుంది.

“దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి.” 1 పేతురు 4:10

“పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.” రోమా 12:13

క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, ఇతరుల అవసరతలకు స్పందించే అవసరత అనేక విధాలుగా మనకు రావచ్చు. వ్యక్తిగతంగా లేదా ఒక బృంద సభ్యునిగా స్థానిక సంఘంలో పరిచర్య చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇతరులకు అందించడానికి మీవద్ద అత్యంత విలువైనది ఉంది!

తోటివారితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకొనేటప్పుడు, లేదా కేవలం ఇతరుల అవసరత గమనించుట మరియు అడగకుండానే దానికి స్పందించి సహాయపడుట ద్వారా మనకు కొన్ని అవకాశాలు లభిస్తాయి.

సమయం, వనరులు, తలాంతులు లేదా కేవలం ఒక ప్రోత్సాహకరమైన మాట పలుకుట వంటి ఏ స్పందనయైనా అది పరిచర్య చేయడమే. కానీ మనం చేయగలిగిన పనుల్లో మనకు పరిమితి ఉందని దేవునికి కూడా తెలుసు కనుక మనం మాట ఇచ్చేటప్పుడు బాధ్యతాయుతంగా మరియు మంచి గృహనిర్వాహకులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.

“సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిం చును.” 2 కొరింథీయులకు 9:7

మనలను మనం సంతోషంగా అర్పించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కొన్నిసార్లు చేయలేను అని చెప్పడం కష్టమే కానీ మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయటం మన ఆనందాన్ని పోగొడుతుందనే మాట వాస్తవం మరియు మనం పరిచర్య చేసేటప్పుడు సంతోషంగా చేయాలని దేవుడు కోరుతున్నాడు.

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te