ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

7 యొక్క 2

“విజయవంతమైన సంబంధాలకు సూత్రాలు”

ప్రతి సంబంధం, అది ఒక స్నేహితునితోనైనా, కుటుంబ సభ్యునితోనైనా, జీవిత భాగస్వామితోనైనా, లేదా దేవునితోనైనా, దానిని విజయవంతం చేయాలంటే రెండు ప్రాధమికమైన విషయాలు ఉంటాయి: ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ మరియు ఆప్యాయత, మరియు ఆ ప్రేమను క్రియా రూపంలో చూపించడం.

నిజమైన ప్రేమ క్రియాలో చూపించబడుతుంది అనేది సత్యం; ఒక స్నేహితుడు మరొకడు అక్కరలో ఉన్నాడని చూసినప్పుడు స్పందించి సహాయం చేస్తాడు. దేవునితో మన సంబంధం విషయంలో కూడా ఇదే సత్యం. దేవుని పట్ల నిజమైన ప్రేమ ప్రేమతో ముడిపడి ఉంటుంది; మన చుట్టూ ఉన్నవారి హృదయాలను తాకుట ద్వారా దేవుని హృదయాన్ని తాకుతాము.

ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటం దేవునితో మన సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి, ఇతరులతో మన సంబంధం దేవునితో మన సంబంధం యొక్క కొనసాగింపుగా ఉండాలనేది దేవుని మాట. బైబిలులో చెప్పబడిన ఆజ్ఞలలో రెండు అతి గొప్పవాటి గురించి యేసు ఏమి చెప్పాడో చూడండి:

“నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను.” మార్కు 12:30-31

విశ్వాసులముగా, దేవునితో మనకున్న ఊర్థ్వ సంబంధం మరియు తోటివారితో ఉండే సమాంతర సంబంధం అనే రెండూ దేవుని దృష్టిలో ముఖ్యమైనవే – దేవునిని ప్రేమించుట మరియు ఇతరులను ప్రేమించుట.

వాక్యము

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te