ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

7 యొక్క 7

“క్రైస్తవులతో సహవాసం”

ఇతర విశ్వాసులకు ప్రోత్సాహం, ప్రేమ మరియు బలమును అందించుట మనకు అత్యంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యతగా ఉండాలి. వాస్తవం ఏమిటంటే, మనం ఒకరికొకరం అవసరమైయున్నాము. దేవుడు అదేవిధంగా మనలను రూపొందించాడు. “ఎవరి సహాయం లేకుండా మనం పనిచేయాలని” దేవుడు కోరుటలేదు.

“కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” హెబ్రీయులకు 10:24-25

ఇతర క్రైస్తవులతో సంబంధాలు పెంపొందించుకొనుట మన స్వంత ఎదుగుదలకు ఎంతో ప్రాముఖ్యమైంది అనే మాట సత్యం. కేవలం మనం మాత్రమే ఆ పనిని చేయగలిగినట్లుగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటానికి లేదా పరిచర్య చేసుకోవటానికి దేవుడు “దైవిక పరిచయాలు” ఏర్పాటు చేస్తాడు.

“ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?” ప్రసంగి 4:9-12

సంఖ్యాపరమైన బలం క్రైస్తవులకు కూడా అన్వయించుకోవాలి, మరియు తోటి విశ్వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం, దేవునితో మన సంబంధంలో ఎదుగుటకు సహాయపడుతుంది!

మీరు ఇతర విశ్వాసులతో సంబంధం కలిగి ఉండాలనే ప్రాణాళికతోనే దేవుడు స్థానిక సంఘాలను స్థాపించాడు. అందరితో కలిసి పనిలో పాల్గొనుట ద్వారా క్రీస్తునందు మీ సహోదరీసహోదరులతో ఆశీర్వాదాలను యిచ్చుట మరియు పుచ్చుకొనుట యొక్క ప్రయోజనాలను ఆనందించండి!

రోజు 6

ఈ ప్రణాళిక గురించి

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te