ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

7 యొక్క 3

“దేవుని పట్ల మన ప్రేమను పెంపొందించుకొనుట”

మన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటం దేవుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటం కంటే సవాలుతో కూడిన పని. దేవుని మనం భౌతికంగా చూడలేకపోవటం అనేది ఒక ప్రధానమైన కారణం. కనుక, దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండటం మరియు దానిని పెంపొందించుకోవటానికి విశ్వాసం అవసరం.

“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.” హెబ్రీయులకు 11:1

మనం దేవుని మన భౌతిక నేత్రాలతో చూడలేకపోయినా మన హృదయాలలో నుండి నేరుగా ఆయనకు ప్రేమను అందించడానికి విశ్వాసం మనకు సహాయపడుతుంది. దేవుని పట్ల మన ప్రేమను పెంపొందించుకోవడానికి, మన క్రైస్తవ జీవితాల్లో విశ్వాసం పనిచేస్తూ ఉండాలి.

మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, మన జీవితాల్లో మరియు ఇతరుల జీవితాల్లో ఉన్న ఆయన ప్రేమను మరియు ఆయన పనిచేస్తున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉండగా, ప్రార్థనలో ఆయనతో సహవాసం చేస్తుండగా, మనం దేవుని గూర్చి మరింతగా తెలుసుకోవడం ప్రారంభిస్తాము. కాలం గడుస్తున్న కొలదీ ఆయనను మరింతగా తెలుసుకోవడం వలన అది మన జీవితాల్లో నిజమైన, పెరుగుచున్న ప్రేమను వృద్ధి చేస్తుంది.

దేవుని పట్ల మన విశ్వాసమును బట్టి ఆయన పట్ల ప్రేమను పెంపొందించుకోవడం అనేది ఆ ప్రేమను క్రియల్లో చూపించడం మీద ఆధారపడి ఉంటుంది:

“ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.” యాకోబు 2:17

క్రియాసహితమైన సమర్పణతో కూడిన విశ్వాసం ద్వారా వచ్చే దేవుని పట్ల ప్రేమ విజయవంతమైన, అభివృద్ధి చెందుతున్న సంబంధానికి అవసరం.

మన విశ్వాసాన్ని క్రియలలో చూపించుట ద్వారా దేవుని పట్ల మన ప్రేమ తప్పనిసరిగా పెరుగుతుంది కానీ ఈ క్రియలు మన పట్ల దేవుని ప్రేమను మరియు కరుణను సంపాదించలేవని కూడా మనం అర్థం చేసుకోవాలి.

సత్యం ఏమిటంటే, మనకు దేవుని గురించి తెలియక పూర్వమే దేవుడు మనలను ముందుగానే అధికముగా మరియు షరతులు పెట్టకుండా ప్రేమించాడు. దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ఉండే మన ప్రేమకు దేవుని ప్రేమే నిజమైన మూలం.

“ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” 1 యోహాను 4:19

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te